Ganguly tweets: Extremely happy to see Yuvraj singh picked by mumbai ...has been a great player for the country in shorter format ..good wishes to him @YUVSTRONG12
#IPL2019
#SouravGanguly
#YuvrajSingh
#MumbaiIndians
ఐపీఎల్ 2019 కోసం నిర్వహించిన వేలంలో టీమిండియా వెటరన్ ప్లేయర్ యువరాజ్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో గంగూలీ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. పొట్టి క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ జట్టు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అతనికి శుభాకాంక్షలు" అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో యువీని తొలి దశలో కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు.